![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -297 లో..... జ్యోత్స్న దగ్గరికి దీప వెళ్లి తిరిగి వస్తుంటే కార్తీక్ ఎదురుపడతాడు. ఆ జ్యోత్స్నకి బుద్ది చెప్పి వచ్చానని దీప అంటుంది. నువ్వు చెప్తే అక్కడ ఒక అత్త తప్ప ఎవరు నమ్మరని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఆవిడా కూడా నమ్మలేదు ఆధారాలు కావాలట.. ఎక్కడ నుండి తీసుకొని వస్తామని దీప అంటుంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అనగానే దశరథ్ అన్న మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. నాకు మీ లాగే ఉంది కానీ అక్కడ నుండి వస్తుంటే మీ మావయ్య గారు నన్ను ఆపి నిన్ను నా కూతురు అనుకొని అడుగుతున్నా.. ఈ విషయం ఇక్కడితో వదిలేయమని చెప్పాడు. ఇక కోపం, ఆవేశం ఎక్కడ ఉంటాయని దీప అంటుంది.
నా కూతురుపై ఎటాక్ చేసిందని తన కూతురిని కొట్టినందుకు సుమిత్ర గారు నన్ను కొట్టారని దీప అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. ఆవిడ కొట్టిన దెబ్బల కంటే తను అన్న మాటలు గట్టిగా తాకాయని దీప బాధపడుతుంది. పద ఇంటికి వెళదాం.. నీకోక విషయం చెప్పాలని దీపని ఇంటికి తీసుకొని వెళ్తాడు కార్తీక్. మరోవైపు దీప ఇంటికి వచ్చి నా మనవరాలిని కొడుతుందా అని శివన్నారాయణ కోపంగా ఉంటాడు. నా ప్రాణాలు కాపాడిందని సైలెంట్ గా ఉన్నాను.. నా కూతురుని నా ముందే కొడుతుందా అని సుమిత్ర అంటుంది. ఒకవేళ జ్యోత్స్న నిజంగానే తప్పు చేస్తే అని దశరథ్ అనగానే.. దీప చేస్తానన్న పని నేనే చేసేదాన్ని పోలీసులకి పట్టించేదాన్ని అని సుమిత్ర అంటుంది. అసలు జ్యోత్స్న నిజం గానే దీప, శౌర్యలని చంపాలని చూస్తుందని అనుకుందాం.. దాస్ ని చంపాలి అనుకున్నదానికి దీనికి ఎమన్నా సంబంధం ఉందా అని దశరథ్ అనుకుంటాడు.
దీప, కార్తీక్ లు ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్లారని కాంచన అడుగుతుంది. కాంచనకి జరిగింది ఏం చెప్పరు. శౌర్యని తీసుకొని రావడానికి మనం వెళ్ళాలిసిన అవసరం లేదు.. స్కూల్ బస్ వస్తుంది. అందులో వెళ్ళమని శౌర్యకి కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శౌర్యతో దీప మాట్లాడుతుంది. నువ్వు చూసింది జ్యోత్స్నని కాదు ఎక్కడ అలా అనకు అంటూ తన మైండ్ ని డైవర్ట్ చేస్తుంది దీప.. అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను లాకెట్ పారెసుకున్నానని శౌర్య అనగానే నా ప్రాణధాత ఎప్పుడు నా పక్కనే ఉంటుందని ఇండైరెక్ట్ గా కార్తీక్ మాట్లాడతాడు. కార్తీక్ లాకెట్ చూపించాగానే శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీప తనే ప్రాణధాత అని బయటపడకపోయేసరికి నేనెందుకు బయటపడతానని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |